ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )దర్శకత్వంలో సలార్ సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే.అది ప్రస్తుతం థియేటర్లలో విడుదలై బ్రహ్మాండమైన హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
థియేటర్స్ నిండుగా జనాలు కనిపిస్తూ ప్రభాస్( Prabhas ) కి చాలా ఏళ్లుగా దూరమైన విజయాన్ని ప్రశాంత్ తిరిగి తెచ్చి ఇచ్చాడని అనుకోవచ్చు.అయితే ఇలాంటి ఒక మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ సినిమా చేసే దర్శకులు అందరూ కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు.
మరి ప్రశాంత్ నీల్ మాత్రమే ఈ విషయంలో ఎందుకు సక్సెస్ అవుతున్నాడు.మిగతా దర్శకులకు ప్రశాంత్ నీల్ కి ఉన్న తేడా ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక మాటలో చెప్పాలంటే సలార్ సినిమా కేజీఎఫ్ కి ( KGF )మూడో పార్ట్ అని అనుకోవచ్చు.ఎందుకంటే ఈ సినిమాలో పూర్తి యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది.అలాగే నెత్తురు, హింస ప్రశాంత్ సినిమాల్లో వెరీ కామన్ గా ఉంటాయి.కేజీఎఫ్ రెండు భాగాల్లో ఉన్నట్టుగానే ఇది ఒక మూడో పార్ట్ కింద మనం చెప్పుకున్న తప్పు లేదు.
ఎలాంటి ఎమోషన్స్ కి స్థానం లేదు.ఇంతకు ముందు సినిమాల్లో తల్లి ఎమోషన్ ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా ప్రభాస్ కి తల్లిగా ఈశ్వరి రావు( Ishwari Rao ) నటించగా ఆమె చాలా బాగా పర్ఫార్మ్ చేసింది.
ఇందులో తల్లి ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు.హీరోయిన్స్ తో ఎలాంటి రొమాన్స్ ఉండదు అలాగే పిచ్చు గెంతులు కూడా ఉండవు.
సినిమాకి తగ్గట్టుగా ప్రశాంత్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది.ఆయనకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ కూడా ఉంది.
అలాగే బిజిఎం కూడా అదరగొట్టాడు.ఎలాంటి తిక్క పాటలకు స్థానం లేదు.
ఇక ప్రశాంత్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనం ఇంతకు ముందే చూసాం.ఇప్పుడు ఇందులో కూడా ప్రభాస్ కి బ్రహ్మాండమైన ఎలివేషన్స్ సీన్స్ దక్కాయి.ఆ ఎలివేషన్స్ ప్రభాస్ కి చాలా బాగా సెట్ అయ్యాయి కూడా.అందుకే కథను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇంతకు ముందు వచ్చిన ఆనిమల్, పఠాన్, అఖండ ,జవాన్ సినిమా లాగానే యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది.
అలాగే ఈ సినిమా ఒక డార్క్ బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు.