మామిడి తోటలలో పూత సమయంలో వాడాల్సిన పిచికారి మందులు..!

మామిడి తోటలలో( Mango Cultivation ) సంవత్సరం పొడుగునా చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తైతే.పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు.

 Spraying Drugs To Be Used During Coating In Mango Plantations , Mango Cultivati-TeluguStop.com

ఎందుకంటే.పంట పూత దశలో ఉన్నప్పుడు చీడపీడలు, తెగుళ్లు ఆశించకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.మామిడి తోటల్లో పూత ప్రారంభమయ్యే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

మామిడి తోటలలో పూత రాకముందే చెట్ల కొమ్మలకు ఏవైనా తెగుళ్లు ఆశించినట్లయితే.ఆ చెట్ల కొమ్మలను కత్తిరించి కాల్చి నాశనం చేయాలి.

చెట్ల మొదల వద్ద వివిధ రకాల కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.ముఖ్యంగా సేంద్రియ ఎరువులు( Organic fertilizers ) అందించి, తోటలకు నీటి తడులు అందించాలి.

Telugu Agriculture, Gray, Mango, Monocrotophos, Yield-Latest News - Telugu

చెట్లకు పూత బాగా రావాలంటే.అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బెట్ట అవసరం.ఇక పూత పువ్వు మొగ్గ దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడులు అందించాలి.మామిడిలో పూతరాలడం సహజం, మొగ్గ పుష్పాలు ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి.అధిక ఉష్ణోగ్రత, బూడిద తెగుళ్లు( Gray pests ), తేనె మంచు, నీటి ఎద్దడి, అధిక తేమ, హార్మోన్ల లోపం ఉంటే మామిడి పిందెలు, మామిడికాయలు రాలిపోతాయి.తేనె మంచు పువ్వుల నివారణ కోసం 50% కార్బరిల్ మందు మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.మూడు వారాల తర్వాత మోనోక్రోటోఫాస్( Monocrotophos ) 1.6మి.లీ ను మామిడి పిందెలపై పిచికారి చేయాలి.

Telugu Agriculture, Gray, Mango, Monocrotophos, Yield-Latest News - Telugu

బూడిద తెగుళ్ల నివారణకు నీటిలో కరికే గంధకం మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కతడిచేలా పిచ్చి కారి చేయాలి. ఈ తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటే.ఒక మిల్లీమీటర్ కాంటాఫ్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పోషకాల లోపం ఉంటే రెండు గ్రాముల బోరాన్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.సూక్ష్మ పోషకాల లోపం ఉంటే పూత రాకముందే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను మూడు గ్రాముల జింక్ ను ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు పిచికారి చేయాలి.

రసం పీల్చే పురుగుల నివారణ కొరకు ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను( Neem oil ) ఒక లీటర్ నీటిలో కలిపి చెట్లకు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube