విమానాలల్లో భోజనాన్ని బుక్ చేసుకోవడం కామన్ అయిపోయింది.చాలా గంటలపాటు కొనసాగే విమాన ప్రయాణంలో ఆకలి తీర్చడానికి ఇన్ ఫ్లైట్ మీల్స్ అవైలబుల్ లో ఉంటున్నాయి.
ఇవి సాఫీగా ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.అయితే, కొంతమంది ప్రయాణీకులు, ముఖ్యంగా పిల్లలు, ఆన్‌బోర్డ్‌లో తినేటప్పుడు సవాళ్లను ఎదురుకోవచ్చు.
తాజాగా టోక్యో( Tokyo )కు వెళ్లే విమానంలో ఒక ఐదేళ్ల బాలుడు ఎక్కాడు కానీ ఫుడ్ తినడానికి కష్టపడ్డాడు.దాంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆ 5 ఏళ్ల చిన్నారికి చెంచాతో ఫుడ్ తినిపించింది.
పిల్లోడికి అటెండెంట్ ఫుడ్ తినిపిస్తున్న వీడియో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో వైరల్ అయ్యింది.13 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన ఈ వీడియోలో అటెండెంట్ రెండు చిన్న ప్లేట్లలో పిల్లలకు ఫుడ్ పెట్టడం చూడవచ్చు.చిన్నారులకు ఫుడ్ పెట్టి వారి విమాన ప్రయాణాన్ని మరింత ఆహారకరంగా మార్చిందని అటెండెంట్‌పై వీడియో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ వెల్లడించింది.
ఈ వీడియో నెటిజెన్ల నుంచి అనేక రకాల ప్రతిస్పందనలను పొందింది.చాలా మంది నెటిజన్లు ఫ్లైట్ అటెండెంట్( Flight attendant ) చూపిన దయను ప్రశంసించారు, మరికొందరు అలాంటి సహాయం అవసరమా అని చర్చించారు.మిగతావారు అటెండర్ చర్యలను అద్భుతమైనవిగా అభివర్ణించగా, మరికొందరు ఆ వయస్సులో ఉన్న పిల్లలు సొంతంగా తినడం నేర్చుకోవాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం తినిపించాలని, ఇతరులపై ఆధారపడకూడదని మరికొందరు పేర్కొన్నారు.ఈ అటెండెంట్ తన పిల్లలను మిస్ అవుతుందేమో అందుకే ఈ పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం తేలపలేదని అన్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.