తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరి కాసేపటిలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు.
ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.ఇవాళ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఇదివరకే మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఖర్గేతో మాణిక్ రావు ఠాక్రే, డీకే శివకుమార్ భేటీ ముగిసిన అనంతరం సీఎం ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.