తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నటువంటి నాని( Nani ) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఇలా ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడుతూ ఇండస్ట్రీలోకి వచ్చారు.
అలాగే తనలా కూడా సినిమాలపై ఆసక్తి ఉండి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో మంది అవకాశాలను కోల్పోతూ ఉంటారు అలాంటి వారికి నాని ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నారని చెప్పాలి.ఇప్పటివరకు నాని ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
తాజాగా హాయ్ నాన్న ( Hi Naana ) సినిమా ద్వారా కూడా నాని మరొక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఇందులో భాగంగా అభిమానులతో సరదాగా ముచ్చటించినటువంటి ఈయనకు మీ తదుపరి సినిమాని ఏ డైరెక్టర్ తో చేయాలి అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు నాని షాకింగ్ సమాధానం చెప్పారు.
తాను బలగం ( Balagam ) సినిమా డైరెక్టర్ వేణు( Venu ) తో కలిసి ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలనుకుంటున్నానని నాని చెప్పినటువంటి ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ ( Venu )గా మారి బలగం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే.బలగం సినిమా ద్వారా నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి వేణు ప్రస్తుతం రెండో సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనులలో ఉన్నారు ఈ సమయంలోనే నాని వేణుతో సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేయడంతో తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
.