Thandel Dunki : ఈ సరికొత్త సినిమా పేర్లకు అర్ధాలు తెలుసా ?

ఒకప్పుడు సినిమా పేర్లు చూస్తే “గుండమ్మ కథ“, “మాయ బజార్”, దాన వీర సూరా కర్ణ అంటూ చిత్రం కథకు అనుగుణంగా పేర్లు ఉండేవి.తరువాత కొన్నాళ్ళకు సినిమాలో హీరో పేరునే సినిమా టైటిల్ గా వాడటం మొదలుపెట్టారు.

 Tollywood Movies And Their Unique Titles-TeluguStop.com

చంటి, ఎస్ పి పరశురామ్ అంటూ చాలా చిత్రాల పేర్లు ఇలానే పెట్టారు.మరి కొన్నాళ్ళకు అసలు సినిమా తో ఎటువంటి సంబంధం లేకుండా టైటిల్స్ పెట్టడం మొదలుపెట్టారు.ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలయింది.ఎవ్వరు… ఎప్పుడు….వినని ఒక పదాన్ని తెచ్చి సినిమా పేరుగా వాడుతున్నారు.ఇటువంటి కొన్ని సినిమా పేర్ల అర్ధాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Salaar, Ayalaan, Dunki, Prabhas, Shahrukh Khan, Surya, Thandel, Thangalaa

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం “సాలార్“.కే జి ఫ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో ప్రభాస్ చిత్రం అనగానే అందరు సాలార్ జపం మొదలుపెట్టారు కానీ ఎవ్వరికీ సాలార్ అన్న పదానికి అర్ధం తెలీదు.సాలార్ ( Salaar )అంటే నాయకుడు, రక్షకుడు అని అర్ధం.ఈ పదం ఉర్దూ భాష నుంచి వచ్చింది.ఈ సినిమా టీజర్, పోస్టర్ లు చూస్తుంటే టైటిల్ కథకు సెట్ అయ్యేలా ఉంది.తాజాగా నాగ చైతన్య హీరో గా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పేరు “తండేల్( Thandel )”.అంటే….మత్స్యకారుల నాయకుడు అని అర్ధం.గుజరాతి మత్యకారులు పడవ నడిపే నాయకుడ్ని తండేల్ అంటారు.ఈ చిత్రంలో నాగ చైతన్య ఒక మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.కనుక ఈ టైటిల్ కూడా చిత్రానికి అనువుగాని ఉంటుంది.

Telugu Salaar, Ayalaan, Dunki, Prabhas, Shahrukh Khan, Surya, Thandel, Thangalaa

తమిళ హీరో విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “తంగళాం“.ఇది ఒక తెగ పేరు.తంగళాం అనే తెగ వారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సూర్య హీరోగా, దార్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం “కంగువా“.తమిళంలో “కంగు” అంటే అగ్ని అని అర్ధం.దాని ఆధారంగా కంగువా….

అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి అని అర్ధం వచ్చేలా ఈ పేరు పెట్టారు.షా రుఖ్ ఖాన్ కొత్త చిత్రం పేరు “డంకి( Dunki )”.

అంటే ….అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం.

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “అయలాన్“, అంటే …పొరుగువారు అని అర్ధం.రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య కలిసి నటించిన చిత్రం “జిగర్ తాండ డబల్ ఎక్స్ “.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.జిగర్ తాండ డబల్ ఎక్స్ అనేది మధురై లో ఒక ఫేమస్ కూల్ డ్రింక్.

దాని ఆధారంగా ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube