యానిమల్ ప్రొమోషన్స్.. దేశమంతా తిరగలేక తల పట్టుకున్న రష్మిక.. ఫోటో వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రష్మిక నటించినటువంటి బాలీవుడ్ చిత్రం యానిమల్ ( Animal ) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Latest News About Rashika Mandanna, Rashika Mandanna, Tollywood, Sandeep Reddy,-TeluguStop.com

డైరెక్టర్ సందీప్ రెడ్డి ( Sandeep Reddy )వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక దేశమంతా కలియ తిరుగుతున్నారు.

ఒకరోజు ఒక నగరంలో ఉంటే మరొక రోజు ఇంకో నగరానికి వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి.ఒకవైపు ఇతర సినిమాలో షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు రష్మిక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక ఇదివరకే పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేదు.ఈ క్రమంలోనే యానిమల్ సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో రణబీర్( Ranbir Kapoor ) తో కలిసి ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి సైతం డైరెక్టర్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి రష్మిక హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇలా వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ యానిమల్ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈమె చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది .

Telugu Animal, Sandeep Reddy, Tollywood-Movie

ప్రతి ఒక్కరూ రష్మిక పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్నారు.రష్మిక ఫ్లైట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ యానిమల్ ప్రమోషన్ కోసం తాను వరుసగా హైదరాబాద్ బాంబే ఢిల్లీ బెంగళూరు, మైసూర్, చెన్నై ఇలా వరుసగా వెళ్లాల్సి రావడంతో ఈమె ఏడుస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా ఈ సినిమా కోసం దేశమంతా వరుసగా తిరగలేక ఈమె కాస్త ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో అయ్యయ్యో శ్రీవల్లికి ఎంత కష్టం వచ్చిందే అంటూ అభిమానులు ఫన్నీగా పోస్టులు చేస్తున్నారు.

Telugu Animal, Sandeep Reddy, Tollywood-Movie

ఇక రష్మిక ఇతర సినిమాల విషయానికి వస్తే ఈమె పుష్ప 2 సినిమాతో పాటు ధనుష్ సరసన ఒక సినిమాకు కమిట్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పాలి.

ఇక ఈ సినిమా పై రష్మిక ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా కనుక మంచి హిట్ అందుకుంటే ఈమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమవుతుందని భావిస్తున్నారు.

మరి ఈ సినిమా అయినా రష్మికకు కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube