చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. ఇవాళ టన్నెల్ నుంచి బయటకు రానున్న కార్మికులు..!!

ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా సొరంగం దగ్గర అధికారులు నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.దీంతో మరి కాసేపట్లో సొరంగం చీకట్ల నుంచి 41 మంది కార్మికులు బయటకు రానున్నారు.

 The Rescue Operation Is At The Last Stage.. The Workers Will Come Out Of The Tun-TeluguStop.com

ఇప్పటికే ఢిల్లీ, రూర్కీ నుంచి నిపుణుల బృందం టన్నెల్ దగ్గరకు చేరుకుంది.ఈ క్రమంలోనే టన్నెల్ దగ్గర హెలికాప్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచడంతో పాటు 41 పడకల ఆస్పత్రిని సైతం ఏర్పాటు చేశారు.

సొరంగానికి సమాంతర డ్రిల్లింగ్ ద్వారా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.దాదాపు 12రోజులుగా చిక్కుకుపోయిన కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే 800 మి.మీ వ్యాసం కలిగిన ఉక్కు పైపులను లోపలికి దింపిన ఎన్డీఆర్ఎఫ్ కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తోంది.దీని ద్వారా కార్మికులు ఇవాళ బయటకు వచ్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కార్మికుల కుటుంబ సభ్యులు టన్నెల్ వద్దకు చేరుకున్నారు.మరోవైపు టన్నెల్ బయట భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube