వశిష్ట మూవీలో చిరంజీవి పాత్ర పేరు ఇదే.. ఆ కామెడీ టైమింగ్ తో చిరంజీవి అలరించనున్నారా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు మెగాస్టార్.

 Exclusive News On Vasishta And Chiranjeevi Combo, Vasishta, Chiranjeevi, Tollywo-TeluguStop.com

అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతినిండా వర్షం అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే చిరంజీవి, వశిష్ట ( vasishta )కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసింది.ఆ సినిమాను యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రత్యేకమైన ఒక ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుందట.

Telugu Chiranjeevi, Tollywood, Vasishta-Movie

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు విశ్వంభర ( visvambara )అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో చిరంజీవి పాత్ర పేరు కూడా తెలిసింది.

ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు ( Bhimavaram Dorababu )అనే పాత్రలో నటించబోతున్నారట.భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలౌతుందని టాక్.ఇందులో చిరంజీవి లుక్, గెటప్ కూడా విలక్షణంగా ఉండబోతున్నాయని, చిరంజీవిలో చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుందని, ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫుల్ గా అలరించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Chiranjeevi, Tollywood, Vasishta-Movie

దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే సాహస యాత్రకు తీసుకెళుతోందని, ఈ పాత్ర ప్రయాణం చాలా గమ్మత్తుగా వుటుందని సమాచారం.విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్ పైకి వెళ్ళనుంది.మరి ఈ సినిమాతో అయినా చిరంజీవి సక్సెస్ ని అందుకుంటారో లేదో చూడాలి మరి.కాగా ఈ మధ్యకాలంలో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు చిరంజీవి రేంజ్ కి తగ్గ సినిమాలు కావని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube