వశిష్ట మూవీలో చిరంజీవి పాత్ర పేరు ఇదే.. ఆ కామెడీ టైమింగ్ తో చిరంజీవి అలరించనున్నారా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు మెగాస్టార్.

అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతినిండా వర్షం అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే చిరంజీవి, వశిష్ట ( Vasishta )కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసింది.

ఆ సినిమాను యు.వి.

క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రత్యేకమైన ఒక ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుందట.

"""/" / ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు విశ్వంభర ( Visvambara )అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో చిరంజీవి పాత్ర పేరు కూడా తెలిసింది.

ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు ( Bhimavaram Dorababu )అనే పాత్రలో నటించబోతున్నారట.

భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలౌతుందని టాక్.ఇందులో చిరంజీవి లుక్, గెటప్ కూడా విలక్షణంగా ఉండబోతున్నాయని, చిరంజీవిలో చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుందని, ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫుల్ గా అలరించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

"""/" / దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే సాహస యాత్రకు తీసుకెళుతోందని, ఈ పాత్ర ప్రయాణం చాలా గమ్మత్తుగా వుటుందని సమాచారం.

విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.

ఎం.ఎం.

కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మరి ఈ సినిమాతో అయినా చిరంజీవి సక్సెస్ ని అందుకుంటారో లేదో చూడాలి మరి.

కాగా ఈ మధ్యకాలంలో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు చిరంజీవి రేంజ్ కి తగ్గ సినిమాలు కావని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

షాకింగ్ వీడియో: కనురెప్ప పాటులో తల్లిబిడ్డలను పొట్టన పెట్టుకున్న కారు..