రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలనీ రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు.శనివారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కు వచ్చిన వ్యయ పరిశీలకులు జిల్లా కలెక్టర్,ఎస్పి తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు , స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు వాటి పనితీరు తదితర అంశాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,ఎస్పి ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు.సమావేశంలో వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ, ఎన్నికల్లో వ్యయ పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు.
చట్టంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థికి రూ.40 లక్షల వ్యయ పరిమితి వుందన్నారు.అభ్యర్థులు ఖర్చు విషయమై రిజిస్టర్లు నిర్వహించాలని, వ్యయ పరిశీలన బృందం అభ్యర్థుల వ్యయంపై షాడో రిజిస్టర్లు నిర్వహించాలని అన్నారు.రోజువారి నిర్వహణపై రిజిస్టర్లు చేపట్టాలన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ప్రతిరోజూ సమర్పించే నివేదికల కాపీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యయ పరిశీలకులకు సంబంధిత అధికారులు సమర్పించే లా చూడాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచించారు.సమీకృత కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు.
సమావేశం అనంతరం కలెక్టరేట్ లోని సమీకృత కంట్రోల్ రూమ్ (ఫిర్యాదు పర్యవేక్షణ కేంద్రాన్ని), ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్ లతో కలిసి పరిశీలించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై, 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్, కంట్రోల్ రూం, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను సమీకృత ఎన్నికల జిల్లా కంట్రోల్ రూమ్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు.
చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటుచేసిన సిసి కెమెరా లను , ఎన్నికల వాహనాల మూవ్మెంట్ ను జిపిఎస్ ఆధారిత పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తున్నట్లు, సత్వర చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వారికి తెలిపారు.
మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన టివి లను వాచ్ చేస్తూ ఎన్నికల ఉల్లంఘనలు, ఫిర్యాదులు, ప్రకటనలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు .ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కోసం వచ్చే ప్రకటనలకుపరిశీలిస్తూ నిబంధనల మేరకు ఉన్న ప్రకటనలకు అనుమతులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి రామ కృష్ణ, ప్రత్యేక అధికారిని స్వప్న ,జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారులు పి బి శ్రీనివాస చారి, జిల్లా లేబర్ అధికారి రఫీ ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్, చేనేత జౌలి శాఖ జిల్లా అధికారి సాగర్ సాగర్, లైజన్ అధికారి నర్సింహులు ఉన్నారు.