తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు( Telangana state decade celebrations ) జూన్ 2 నుంచి 22 వరకు మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు జిల్లా లో ఘనంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల( Telangana Formation Day ) కు సంబంధించి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ పరంగా చేయవలసిన ఏర్పాటలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….

 Telangana State Decade Celebrations Should Be Celebrated Grandly Says Sp Akhil M-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క మూడు వారల పాటు భద్రత పరమైన ఏర్పాట్లను చూడాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా పోలీస్ శాఖ నిర్వహించే సురక్ష దినోత్సవం( Suraksha Day ),తెలంగాణ రన్ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.

జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం :

• శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు.ఆదివారం రోజున ఉదయం పోలీస్ బ్యాండ్, పోలీస్ అధికారులతో సిరిసిల్ల టౌన్ లో జిల్లాలోని పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోల్ట్స్ , వెహికిల్స్ తో ర్యాలీ నిర్వహించాలి.

అనంతరం పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా,కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.పోలీసుశాఖ సాధించిన ఘనతలను,విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి.పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు,అధునాతన ఆయుధలు,పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన చెప్పట్టాలి.

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పోలీసు శాఖ నేతృత్వంలో యువకులు,విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం( Telangana Run program ) నిర్వహించాలి క్రీడలు, యువజన సర్వీసులశాఖ వారితో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీలు నాగేంద్రచారి,రవికుమార్,సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube