ద్రాక్ష పంటను నాటేటప్పుడు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు..!

మన రాష్ట్రంలో ద్రాక్ష పంట ( Grape Cultivation )సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. ద్రాక్షతో జామ్, రెసిన్స్, ఎండు ద్రాక్షలను తయారు చేస్తారు.

 Ownership Practices To Be Followed While Planting Grape Crop , Grape Farming ,-TeluguStop.com

కాబట్టి ద్రాక్ష ను వాణిజ్య పంటగా చెప్పుకోవచ్చు. ద్రాక్ష పంట సాగుకు పొడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ పంట సాగుకు ఎర్రనేలలు, చల్కానేలలు, లోతైన నేలలు చాలా అనుకూలం. నల్ల రేగడి నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.

ద్రాక్ష పంటను</em( Grape Cultivation ) నాటుకునే విధానం: వేసవిలో నేలను లోతు దుక్కులు దున్నుకొని, ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తీసివేసి నేలను బాగా చదును చేసుకోవాలి.మొక్కల మధ్య మరియు మొక్కల వరుసల మధ్య దూరం ఉండేటట్లు ముందుగా 60 సెంటీమీటర్ల లోతులో గోతులు తవ్వి ఆరనివ్వాలి.మూడు రోజుల తర్వాత గోతిలో రాతి స్తంభాలను పాతి ఇనుప తీగను ఉపయోగించి పందిరి వేయాలి.గోతిలో పై మట్టి 20 కేజీల చివికిన ఎరువు 500 గ్రాముల సూపర్ ఫాస్పేట్( Super phosphate ) 1కేజీ నీమ్ కేక్ వేసి గుంతను నింపాలి.

దెబ్బలు తగలని త్వరగా వేర్లు ఏర్పడిన కొమ్మలను ఆ గోతిలో నాటుకోవాలి.ఎర్ర నేలల్లో సాగు చేస్తే సంవత్సరానికి 35 నీటి తడులు అవసరం.మిగతా నేలల్లో అయితే నేలలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులు అందించవలసి ఉంటుంది.ద్రాక్ష తోటలో ఎప్పటికప్పుడు కలుపును( Weed ) నివారించాలి.

ఏవైనా చీడపీడలు ఆశిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.

ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తియ్యగా ఉంటే ఆ గుత్తి కోతకు వచ్చినట్లే.తెల్లని ద్రాక్ష బాగా తయారైనప్పుడు అంబర్ రంగులోకి మారుతుంది.బాగా తయారైన పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పంట కోతలు చేయాలి. ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 టన్నులకు పైగానే దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube