రాజన్న సిరిసిల్ల జిల్లా:ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి( K K Mahender Reddy ) అన్నారు.
ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి పేట మండలంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి గౌడ సంఘం సభ్యులు నా పై చూపిన ఆదరణ ఎప్పుడు మరిచిపోలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు.
నాకు నేరుగా కలువ వచ్చని ఈ ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌస్, రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టీం జిల్లా అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి, పసుల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పందీర్ల లింగం గౌడ్,బుచ్చిలింగు సంతోష్ గౌడ్,గంట ఆంజగౌడ్,మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బీపేట రాజ్ కుమార్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు