తెలంగాణ బీజేపీలో జనసేన పార్టీతో పొత్తు పంచాయతీ కొనసాగుతోంది.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జోరందుకుంది.
ఈ క్రమంలో నాగర్ కర్నూల్ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత దీలీప చారి జనసేనకు సీట్ కేటాయించవద్దంటూ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తన అనుచరులతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.