టీ.బీజేపీలో జనసేనతో పొత్తు పంచాయతీ… ఆశావహుల ఆందోళన

తెలంగాణ బీజేపీలో జనసేన పార్టీతో పొత్తు పంచాయతీ కొనసాగుతోంది.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జోరందుకుంది.

ఈ క్రమంలో నాగర్ కర్నూల్ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేత దీలీప చారి జనసేనకు సీట్ కేటాయించవద్దంటూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తన అనుచరులతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమంత కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?