ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ( Singer Sunitha )చిన్న వయసులోనే నేషనల్ అవార్డును గెలుచుకుంది.2002 నుంచి 2006 వరకు ఈ టాలెంటెడ్ సింగర్ వరుసగా నంది అవార్డులను గెలుపొందింది.సింగర్ సునీత వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది.ఆమె పాడుతున్న మెలోడియస్ పాటలు వింటుంటే వినాలనిపిస్తుంది.గత 15 ఏళ్లుగా సునీత మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏకచక్రాధిపత్యం వహిస్తోంది.తిరుగులేని మెలోడియస్ సింగర్ గా కొనసాగుతోంది.
ఆమె పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి.అయితే మేల్ సింగర్స్ లో సునీతకి సమవుజ్జీలు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నకు తాజాగా ఆమెనే స్వయంగా ఆన్సర్ చేసింది.
సింగర్ సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.గత 15 ఏళ్లలో తనకు సమఉజ్జీలుగా నిలిచిన మేల్ సింగర్స్ ఎవరూ లేరంటూ ఆమె స్పష్టం చేసింది.తెలుగులో చాలామంది మేల్ సింగర్స్ ( Male singers )వస్తుంటారు పోతుంటారని, ఎవరూ కూడా కాన్స్టంట్‌గా పాటలు పాడలేదని ఆమె పేర్కొంది.వారు ఎప్పుడు కూడా డామినేషన్ ప్రదర్శించలేదని కూడా స్పష్టం చేసింది.
ఈ పాట ఈ సింగర్ మాత్రమే పాడాలి అనే ఒక ప్రభావాన్ని ఏ గాయకుడు కూడా సృష్టించలేకపోయాడని ఆమె వివరించింది.తమిళంలో కార్తీక్, టిప్పు( Singer Karthik Tippu ) మాత్రం చాలా భాషల్లో మోస్ట్ డిమాండ్ సింగర్స్ గా ఉన్నారని ఆమె పేర్కొంది.
తెలుగు సింగర్స్ కి బాగా టాలెంట్ ఉందని కానీ వారు డెడికేటెడ్ గా, కంటిన్యూగా పాటలు పాడటం లేదని ఆమె పేర్కొంది.అవకాశాలు రాకపోవడం వల్ల కూడా ఒక బాల సుబ్రహ్మణ్యంలా వారు ఫుల్ టైం సినీ సింగర్స్ కాలేకపోయారని ఆమె తెలిపింది.ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగలనని కూడా నొక్కి వక్కాణించింది.అయితే తనకు సమవుజ్జీలు ఎవరూ లేరని సునీత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తుండగా మరికొందరు మాత్రం కొందరు మేల్ సింగర్ల పేరు చెబుతున్నారు.సునీత పాటలు పాడటం మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లకు తన గాత్రం దానం చేసింది.
సౌందర్య, రాశి, సిమ్రాన్, రంభ, అమీషా పటేల్, ( Ameesha patel )భూమిక చావ్లా, లయ, స్నేహ, అనిత హంసానందిని, గజాల, శ్రియ శరన్, సదా ఎలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పింది.ఆమె వాయిస్ చాలా మంది హీరోయిన్లకు బాగా సూట్ అవుతుంది.