మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు నటించిన రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అంటే చాలు అలాంటి హీరోయిన్లకు సినిమా అవకాశాలు వచ్చేది చాలా తక్కువ.స్టార్ డైరెక్టర్ లతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా అలాంటి హీరోయిన్ లకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు.
ప్రస్తుతం హీరోయిన్ సయీ మంజ్రేకర్ ( Saiee manjrekar )పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు వస్తూనే ఉన్నాయి.హీరోయిన్ సయీ మంజ్రేకర్ తెలుగులో మూడు సినిమాలలో నటించింది.
అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది.
అందులో ఒక్క సినిమా తప్ప మిగతావి ఏవి ఆడలేదు.అయినా ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )సరసన నటించే ఛాన్స్ ను కొట్టేసింది సయీ మంజ్రేకర్.
కాగా సయీ మంజ్రేకర్ ( Saiee manjrekar )నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే.ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ 3మూవీలో నటించింది.
అదే ఆమెకి మొదటి సినిమా.కానీ ఆ ఆడలేదు.
దాంతో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి.దాంతో వెంటనే తెలుగుకి షిఫ్ట్ అయింది.
అలా ఆమె తెలుగులో గని అనే చిత్రంతో అడుగుపెట్టింది.
అది ఫ్లాప్ గా నిలిచింది.తర్వాత అడివి శేష్ ( Adivi Sesh )సరసన మేజర్ చిత్రంలో నటించింది.ఇది తెలుగులోనూ, హిందీలోనూ విజయం సాధించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాం పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా( Skanda )లో రెండవ హీరోయిన్ గా నటించింది.భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
మొత్తంగా హిందీ, తెలుగులో కలిపి నాలుగు చిత్రాలు చేస్తే అందులో మూడు ఫ్లాప్ కాగా ఒక మూవీ సక్సెస్ అయ్యింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న కళ్యాణ్ రామ్ 21వ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకుంది.నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి కూడా హాజరైంది.
తెలుగులో ఆమె కెరీర్ బాగానే ఉంది.అయితే నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా ఆమెను అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.