మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )భోళా శంకర్ సినిమా లో సిస్టర్ పాత్ర లో కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే.చిరంజీవి మరియు కీర్తి సురేష్ అన్నా చెల్లిగా నటించడం జరిగింది.
ఇద్దరి కాంబోలో సినిమా లో సెంటిమెంట్ డైలాగ్స్ మరియు సన్నివేశాలు ఉన్నాయి.మొత్తానికి చిరంజీవి మరియు కీర్తి సురేష్ లు నిజంగానే అన్నా చెల్లినా అన్నట్లుగా సన్నివేశాలు పండాయి.
కానీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి చిరంజీవి మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ సినిమా వరకే నేను నీకు అన్నయ్యను తర్వాత నీతో జోడీగా సినిమా చేయాలి అనుకుంటున్నాను అంటూ కీర్తి సురేష్ పై తనకు ఉన్న మోజును చూపించే ప్రయత్నం చేశాడు.ఆ సమయంలో చిరంజీవి పై చాలా మంది విమర్శలు చేశారు.తాజాగా బాలకృష్ణ కూడా అదే విధంగా వ్యవహరించాడు.భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధం అయింది.భారీ అంచనాల నడుమ రూపొందిన భగవంత్ కేసరి సినిమా ( Bhagavanth Kesari Movie )లో బాలయ్య కూతురు గా శ్రీ లీల నటించింది.
సొంత కూతురు కాకున్నా కూడా కూతురు మాదిరిగా బాలయ్య సినిమా లో శ్రీ లీల ను పెంచినట్లుగా చూపించారు.ఇక సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లీలతో ఈ సినిమాలో ఇలా నటించాను కానీ.
ముందు ముందు హీరోయిన్ గా నటించాలని అనుకుంటున్నాను అన్నాడు.
అయితే శ్రీ లీల( Sreeleela )తో హీరోయిన్ గా చేయాలని కోరుకుంటున్నట్లుగా మోక్షజ్ఞ తో అంటే బ్యాక్ గ్రౌండ్ బలిసిందా అన్నాడు అంటూ బూతు మాట్లాడాడు.ఇలాంటి బూతులు మాటలు అవసరమా అంటూ కొందరు బాలయ్య ని కూడా విమర్శిస్తున్నారు.తమ కొడుకు లేదా కూతురు వయసు కంటే కూడా చాలా చిన్న హీరోయిన్స్ తో ఇలాంటి మోటు సరసపు మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెస్ట్ స్టార్ హీరోలు అంటూ కొందరు బాలయ్య మరియు చిరు ల పై విమర్శలు చేస్తున్నారు.
చిరు అనుకుంటే నేనేం తక్కువ కాదు అని బాలయ్య కూడా అదే పద్దతి కంటిన్యూ అయ్యాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.