సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఏ సినిమా చేస్తున్న ఆ సినిమా నుండి కొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.ఈయన సినిమాలకు అంత క్రేజ్ ఉంది అనే చెప్పాలి.
మరి సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న మరో మూవీ ”గుంటూరు కారం” ( Guntur Kaaram ). ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని హోప్స్ పెరిగి పోయాయి.

భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా భారీ హైప్ ఏర్పడింది.
ఇక ఈ అప్డేట్ తర్వాత మరో అప్డేట్ అనేది రాలేదు.ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ( Guntur Kaaram First Song ) కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
ఎప్పటి నుండో ఈ సాంగ్ వస్తుంది అని ఊహాగానాలు వస్తున్నాయి.కానీ మేకర్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ( Producer Suryadevara Naga Vamsi ) ఈ ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ తెలిపారు.ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం పక్కాగా అయితే డేట్ ఫిక్స్ చేయలేదు కానీ దసరా కంటే ముందుగానే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.అంతేకాదు ఈ సినిమా రాజమౌళి గారి సినిమాల కలెక్షన్స్ కు దగ్గరగా వెళ్తుందనే నమ్మకం ఉందని ఆ విషయాన్నీ ప్రేక్షకాభిమానులే చెబుతారు అంటూ తెలిపారు.దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రావడం అయితే పక్కాగా కనిపిస్తుంది.