ఢిల్లీ( Delhi ) చరిత్రలోనే అతిపెద్ద చోరీ తాజాగా వెలుగు చూసింది.సెక్యూరిటీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ దొంగలు ఈ పని కానిచ్చేశారు.
భారత రాజధానిలోని 75 ఏళ్ల చరిత్ర గల ఉమ్రావ్ సింగ్ జ్యువెలర్స్‌లో( Umrao Singh Jewellers ) ఈ దొంగతనం జరిగింది.దొంగలు ఏకంగా రూ.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.భోగల్ ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల నగల దుకాణంలోకి ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగలు( Thieves ) ప్రవేశించారు.
షాప్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అడుగుపెట్టే ముందు వారు వైఫై, సిసి టీవీ కెమెరాల కనెక్షన్స్ కట్టర్ తో కట్ చేశారు.తర్వాత పెద్ద కట్టర్ తో స్ట్రాంగ్ రూమ్ కి మనిషి పట్టేంత బొక్క పెట్టారు.

ఆ రంధ్రం గుండా ఒక దొంగ లోపలికి వెళ్లి రూ.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బ్యాగ్ లో వేశాడు.అనంతరం ఆ బ్యాగ్ పట్టుకుని దొంగలు బయటకు వెళ్లి మార్కెట్‌లోని బైలేన్‌లో ఆపి ఉంచిన బొలెరోలో పారిపోయారు.షోరూం పైకప్పు నుంచి చొరబడిన దొంగలు స్ట్రాంగ్‌రూమ్ గోడను కోసి లాకర్ పగులగొట్టి( Locker ) నగలను ఎత్తుకెళ్లిన తీరు పోలీసులకే షాక్ ఇచ్చింది.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దొంగలను ఇంకా పట్టుకోలేదు.దొంగలు బాగా హోంవర్క్ చేశారని, షోరూమ్‌లోకి ప్రవేశించి సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నారని వారు నమ్ముతున్నారు.

చోరీకి గురైన వస్తువులు సుమారు 30 కిలోల బరువుంటాయని ఒక రిపోర్ట్ వెల్లడించింది.వాటిలో కనీసం 3,000 బంగారు, వజ్రాభరణాలు, నెక్లెస్‌లు, చెవిపోగులు, ముడి బంగారు కడ్డీలు సోర్సెస్ తెలిపాయి.దుండగులు సమీపంలోని ఇంటిపై నుంచి షోరూం పైకప్పుపైకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.షోరూమ్‌లోని ఓ ఉద్యోగి ఈ నేరానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.దొంగల కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు.ఢిల్లీ చరిత్రలో ఇదే అతిపెద్ద వజ్రాలు, బంగారు ఆభరణాల చోరీగా పరిగణించబడుతుంది.







