ముఖ్యంగా చెప్పాలంటే మీరు అధిక బరువును తగ్గాలనుకునేవారు చాలా రకాల డైట్లను ఫాలో అవుతూ ఉంటారు.అయితే మీరు బీరకాయలను ( Ridge Gourd )ఎప్పుడైనా ట్రై చేశారా.
బీరకాయ తింటే కచ్చితంగా బరువు తగ్గుతారు.అలాగే బీరకాయతో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.బీరకాయ అనేది ఒక సాధారణమైన కూరగాయ.
ఇందులో ఫైబర్, విటమిన్ సి,ఐరన్ సహా వివిధ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.వాస్తవానికి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఇవి కడుపులోని మంటను, శరీర బరువును అదుపులో ఉంచుతాయి.

బీరకాయ ( Ridge Gourd )వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల( Health benefits ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బరువు తగ్గడానికి బీరకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఇందులో కేలరీలు,సంతృప్తి కోవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
మరోవైపు పీచు పదార్థాలు, నీళ్లు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల బీర కాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు.
ఫలితంగా అధిక బరువు( Overweight ) కూడా దూరం అవుతుంది.ఇంకా చెప్పాలంటే బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.కాబట్టి కాలేయం, కడుపు మంట,ముత్ర పిండాల్లో ఇన్ఫెక్షన్ లాంటి ప్రమాదాలు దూరమైపోతాయి.

బీరకాయ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.బీరకాయ మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా మెగ్నీషియం,పొటాషియం అనే మూలకాలు హృదయనాళ వ్యవస్థను మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.ఇంకా చెప్పాలంటే మధుమేహం ( Diabetes )ఉన్న వారు బీరకాయ తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి బీరకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.అందువల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.పైగా ఇది బీరకాయలోని పోషక పదార్థాలు మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని జీవక్రియను ప్రేరేపిస్తాయి.ఫలితంగా మధుమేహం అనేది చాలా వరకు అదుపులో ఉంటుంది.