తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) ఒకరు.సినిమాలపై చూపే మక్కువ ఏంటో మనకు తెలిసిందే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు( Oscar Award ) ను కూడా గెలుపొందింది అంతలా ఈయన సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడతారు అనే విషయం మనకు తెలిసిందే.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలు అంటే ఆ సినిమాలలో పని చేసే హీరోలు పరిస్థితి గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.తన సినిమా కోసం ఆ హీరోలను ఎన్ని విధాలుగా వాడుకోవాలో అంతకుమించి రాజమౌళి వారిని వాడుకుంటారు.ఒకసారి రాజమౌళి సినిమాకు కమిట్ అయితే మరో మూడు సంవత్సరాల పాటు ఇతర సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం కూడా రాజమౌళి వారికి ఇవ్వరు అంతా కసి పట్టుదలతో ఈయన సినిమాలు చేయటం వల్లే సినిమాలు అంత మంచి సక్సెస్ అవుతుంటాయి.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క హీరో కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలి అని భావిస్తూ ఉంటారు కానీ రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలని కోరుకుంటున్నారట.ఈ విధంగా రాజమౌళి హీరోతో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నటువంటి ఆ లక్కీ హీరో ఎవరు? ఏంటి అనే విషయానికి వస్తే.రాజమౌళి సినిమా చేయాలి అనుకున్నటువంటి హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) .ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.దీంతో రాజమౌళి ఈయనతో సినిమా చేయాలని భావించారట.

సూర్యతో సినిమా చేయడం కోసం రాజమౌళి కొన్ని కథలను కూడా అనుకున్నారు.అయితే ఈ అనుకూలంగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో రాజమౌళి ఇప్పటికే 10 సార్లు ఫెయిల్ అయ్యారని తెలుస్తోంది.ఇప్పటికే రాజమౌళి పదిసార్లు కథను సిద్ధం చేయాలని భావించినప్పటికీ సూర్య కోసం సరైన కథ దొరకకపోవడంతో వీరి కాంబినేషన్లో సినిమా వాయిదా పడుతుందని తెలుస్తుంది.ఇలా సూర్య ఏకంగా రాజమౌళి టాలెంట్ కే పరీక్ష పెట్టారని ఆ పరీక్షలో జక్కన్న మాత్రం గెలవలేక పోతున్నారని చెప్పాలి.
మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు కానీ రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది.
ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
మహేష్ బాబు(Mahesh Babu) తో రాజమౌళి చేయబోయే సినిమా ఒక అడ్వెంచర్స్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ఎక్కువ భాగం ఆఫ్రికా అడవులలోనే జరగబోతుందని సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పూర్తి కాగానే రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నారని చెప్పాలి.