షారుక్ ఖాన్ కి కూడా అల్లు అర్జున్ సినిమాలను చూపించాను... అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అట్లీ ( Atlee ) తాజాగా షారుక్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

 Atlee Show Allu Arjun Movies To Shahrukh During Jawan Shooting, Atlee, Shahrukh,-TeluguStop.com

ఈ విధంగా డైరెక్టర్ అట్లీ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా మంచి సక్సెస్ కావడంతో అట్లీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Telugu Allu Arjun, Atlee, Jawan, Shahrukh-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun ) అంటే చాలా ఇష్టం అని తెలిపారు.అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం, పుష్ప సినిమాలు తనకు చాలా నచ్చాయని ఈ సినిమాలను తరచూ చూస్తూ ఉంటానని అట్లీ వెల్లడించారు.

అయితే ఈ రెండు సినిమాలను తాను షారుక్ ఖాన్ కి కూడా చూపించాను అంటూ ఈ సందర్భంగా అట్లీ తెలిపారు.

Telugu Allu Arjun, Atlee, Jawan, Shahrukh-Movie

జవాన్ షూటింగ్ సమయంలోనే షారుఖ్ ఖాన్ గారికి ఈ రెండు సినిమాలను తాను చూపించాను అంటూ అట్లీ వెల్లడించారు.ఇలా తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ సినిమాలను తరచు చూస్తూ ఉంటానని ఈయన చెప్పడంతో బన్నీ ఫాన్స్ ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు.

మరి అల్లు అర్జున్ అట్లితో సినిమా ఎప్పుడు చేస్తారు ఏంటి అనే విషయాలు తెలియదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ ఒక వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube