కెనడాలో మరో సంచలన హత్య జరిగిందని తెలుస్తోంది.పంజాబ్ గ్యాంగ్స్టర్ సుఖ్ దూల్ సింగ్ అకా హత్యకు గురవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
గ్యాంగ్ స్టర్ల అంతర్గత పోరులో సుఖ్ దూల్ సింగ్ ను ప్రత్యర్థులు హతమార్చారని సమాచారం.కాగా సుఖాపై భారత్ లో అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
తప్పుడు ధృవ పత్రాలతో అతను భారత్ నుంచి కెనడాకు పారిపోయాడని తెలుస్తోంది.కానీ అతను హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపిస్తుంది.
అయితే కెనడాలో ఇటీవల ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందన్న కారణంగా కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు తెలిపింది.
ఈ క్రమంలో భారత్, కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో మరో హత్య చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.