పవన్ పై నమ్మకం తగ్గుతోందా..?

రాజకీయ నాయకులు ప్రజల్లో సుస్థిర స్థానం పొందాలంటే వారిలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన విధి.రాజకీయ నాయకుల పనితీరు, వారు మాట్లాడే విధానం, ప్రజలకు వారిచ్చే భరోసా వంటి వాటితో రాజకీయ నాయకులపై నమ్మకం ఏర్పడుతుంది.

 Is The Trust In Pawan Decreasing , Pawan Kalyan , Tdp , Janasena , Ycp , Bjp-TeluguStop.com

అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారు అధికారంలో నిలుస్తారు.నమ్మకం కోల్పోయిన వారు ఓటమి అంచున నిలుస్తారు.

ఇంతకీ అసలు విషయమేమిటంటే ఏపీలో అటు టీడీపీ ( TDP )పాలన, ఇటు వైసీపీ ( YCP )పాలన చూసిన ప్రజలకు మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అంటే ఆది జనసేన మాత్రమే.

Telugu Cm Jagan, Janasena, Pawan Kalyan-Politics

2014 లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన అప్పుడు టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది.ఆ తరువాత టీడీపీతో తెగతెంపులు చేసుకొని 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్న ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.

ఆ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోవడం గమనార్హం.ఇక ఈ నాలుగేళ్లలో జగన్ ( CM jagan )పాలన కూడా చూసిన ప్రజలు.

పూర్తి స్థాయిలో సంతృప్తిగాను లేదా అసంతృప్తిగాను లేరు.ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం కోసం ఏపీ ప్రజలు జనసేన వైపు చూసే అవకాశం ఉండేది.

Telugu Cm Jagan, Janasena, Pawan Kalyan-Politics

కానీ పవన్( Pawan Kalyan ) తీసుకునే ఆ స్థిర నిర్ణయాల కారణంగా చేజెతుల ప్రజల నమ్మకాన్ని పవనే దూరం చేసుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం.నిన్నమొన్నటి వరకు బీజేపీతో మాత్రమే తమ దోస్తీ అని చెప్పుకొచ్చిన పవన్.అనూహ్యంగా టీడీపీతో కూడా పొత్తు ప్రకటించారు.దీంతో అటు వైసీపీ పై, ఇటు టీడీపీ పై అసంతృప్తిగా ఉన్న తటస్థ ఓటర్లు ఎటు నిర్ణయించుకోలేక సందిగ్ధంలో పడే అవకాశం ఉంది.

జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికి.ఆ పార్టీ కూడా టీడీపీతో జట్టు కట్టడంతో ఓటు బ్యాంకులో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.మొత్తానికి పవన్ ఆ స్థిర నిర్ణయాల కారణంగా ప్రజల్లో జనసేనపై నమ్మకం తగ్గుతుందనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube