తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా( Baahubali )తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
దీంతో ప్రభాస్ అభిమానులు తదుపరి సినిమాలపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని మరొకసారి వాయిదా వేశారు.కాగా హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
కానీ ప్రభాస్ ఒక సినిమాకు మాత్రం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నారట.ఇంతకీ ఆ సినిమా ఏది అన్న వివరాల్లోకి వెళితే.ఆ సినిమా మరి ఏదో కాదు హీరో మంచి విష్ణు( Manchu Vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప.
ఈ సినిమాకి నిర్మాతగా మోహన్ బాబు( Mohan Babu ) వ్యవహరించడంతో పాటు 100 కోట్ల పెట్టుబడి కూడా పెడుతున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.దీంతో భక్తకన్నప్ప పై అంచనాలు పెరిగాయి.
దానికి తోడు హీరో విష్ణు ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఒక పాత్రలో నటించబోతున్నాడు అని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో శివుడి పాత్రలో ప్రభాస్ నటించిన నటించబోతున్నట్టు తెలిపారు.
దీంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.అయితే అన్ని సినిమాలకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట.
అందుకు గల కారణం మంచు కుటుంబంతో ప్రభాస్ కి ఉన్న రిలేషన్ అని తెలుస్తోంది.