పల్లవి ప్రశాంత్…( Pallavi Prasanth ) ఒక రైతు బిడ్డగా చాలా రోజుల పాటు బిగ్ బాస్ కి( Bigg Boss ) వెళ్లాలని కోరికతో తన అభిప్రాయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పంచుకొని కాస్త కూసో ఫేమస్ అయిపోయి చివరికి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడమే లక్ష్యంగా చాలా రోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బిగ్ బాస్ కి చేరేవరకు ఈ వీడియోని లైక్ కొట్టండి షేర్ చేయండి అంటూ ప్రచారం చేసుకున్నాడు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది చాలామందికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని కోరిక ఉంటుంది అది అందరికీ సాధ్యం కాకపోయినా కొందరికి అయితే ఖచ్చితంగా సాధ్యపడుతుంది.
కానీ సామాన్య ప్రజలు వెళ్లాలంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
ఏది ఏమైనా ఒక సాధారణ రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ కి( Bigg Boss House ) వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమే.కానీ అక్కడ గెలవాలంటే కేవలం రైతుబిడ్డ అయితే సరిపోదు ఆటతో పాటు అదృష్టం తోడవ్వాలి.
ఆ పరిస్థితులు, ఈక్వేషన్స్ అన్ని సెట్ చేసుకోగలిగే నాలెడ్జ్ ఉండాలి.తన తోటి సభ్యులందరూ కూడా ఎంతో కొంత ఎన్నో విషయాలు తెలుసుకునే వస్తారు కాబట్టి అందరికీ దీటుగా తన స్ట్రాటజీస్ ప్లే చేయగలగాలి.
కొన్నిసార్లు లవ్ స్టోరీస్ తో హిట్ అయితే మరికొన్నిసార్లు ఆట తీరుతో ముందుకు వెళ్తారు.ఏది ఏమైనా టాప్ ఫైవ్ కి చేరడమే లక్ష్యంగా అందరి ఆట కొనసాగుతుంది.

కానీ పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి తాను బిగ్ బాస్ హౌస్ కి చేరేవరకు ఉన్న పద్ధతి చాలా సాదాసీదాకా ఒక రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అందరిని షేర్ చేయవలసిందిగా కోరుతూ తన పై జాలి కలిగేలా చేసుకున్నాడు కానీ ఒక్కసారి హౌస్ లోకి వెళ్ళాక రతికతో( Rathika Rose ) పులిహోర కలపడంతోనే అతడి పై ట్రోల్స్ మొదలయ్యాయి.అతడు ప్రేమలో పడితే తప్ప గెలవము అనుకున్నాడో ఏమో కానీ తాను రతికతో ఏదో ఒక సందర్భంలో వీలైనంత క్లోజ్ గా ఉండే ప్రయత్నం చేశాడు.అయితే రతిక నామినేషన్ టైంలో చాలా ఘాటుగా అతనిపై స్పందించాల్సి వచ్చింది.

ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఒక ఎమోషనల్ పర్సన్ అని బిగ్ బాస్ హౌస్ లో ఇలా లవ్ స్టోరీస్( Love Stories ) కామన్ కానీ అతడు అంతకు మించి ఏదో కోరుకుంటున్నాడని అందువల్లే అంత ఎమోషనల్ పర్సన్ తో హౌస్ నుంచి బయటకు వెళ్లాక రిలేషన్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ముందే కట్ చేసుకుంటే బెటర్ అని రతిక ఫీల్ అయింది.దాంతో అతని పై ఘాటుగా విమర్శించడంతో అది పల్లవి ప్రశాంత్ తీసుకోలేకపోయాడు.ఏది ఏమైనా ఆట తీరితో గెలిస్తే పల్లవి ప్రశాంత టాప్ పైకి వెళ్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కానీ ఇలా లవ్ స్టోరీస్ ఎఫైర్స్ అంటూ పులిహోర కలిపే పనులు ఇకపైన మానుకుంటే మంచిది అని దారుణంగా వస్తున్నాయి.







