ఇండియా TO భారత్.. ప్రజలకు తిప్పలు తప్పవా..?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జమిలి ఎన్నికలు ( Jamili Elections ) అంటూ ఒక విషయాన్ని బయట పెట్టేసింది.దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

 ఇండియా To భారత్.. ప్రజలకు తిప్పల-TeluguStop.com

భారతదేశానికి ఇండియా( India ) అనే పేరు తీసేసి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.తరుణంలో దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది.

ఇండియాగా ఉన్న పేరును భారత్ గా మారిస్తే ప్రజలకు ఏమైనా లాభాలు ఉన్నాయా.లేదంటే నష్టాలు ఉన్నాయా.

దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bharath, Centrol, Congress, Summit, India, Jamili, Narendra Modi, Pan-Lat

ఇండియాలో జి 20 సదస్సుకు ఢిల్లీ వేదిక అయింది.దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలను వివిధ దేశాల అధిపతులకు పంపించారు.అయితే ఈ పత్రంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాల్సింది పోయి, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ( President Of Bharath ) అని ఉండడంతో వివాదానికి దారి తీసింది.

దీనితో ఇండియా పేరును మార్చి భారత్ పెడుతున్నారని ప్రజలకు అర్థమైంది.అంతేకాకుండా వచ్చేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ తీర్మానం చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదే తరుణంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు జోరందుకున్నాయి.దేశం పేరు మారిస్తే ప్రజలకు కష్టాలు తప్పవని రకరకాల మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. రాజ్యాంగంలో దేశం పేరు మారిస్తే జనం మళ్ళీ క్యూలైన్లు కట్టాల్సిందే అని ప్రజలు భయపడిపోతున్నారు.

Telugu Bharath, Centrol, Congress, Summit, India, Jamili, Narendra Modi, Pan-Lat

దీనికి ప్రధాన కారణం పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇతర డాక్యుమెంట్స్ పై ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది.దీని స్థానంలో గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని పేర్లు మార్చుకోవాలి.దీనికోసం ప్రజలంతా మీసేవ ఇతర నెట్ సెంటర్లు , ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తప్పనిసరిగా తిరగాల్సిందే.

అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మనీ పైన కూడా భారత్ ( Bharath ) అని మారాలి అంటే ఈ నోట్లను కూడా రద్దుచేసి మళ్ళీ కొత్త నోట్లు ముద్రించాలి.దీనివల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని భయపడిపోతున్నారు.

ఇప్పటికే నోట్ల రద్దు సమయంలో ఎంతో మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడి దాని నుంచి గట్టెక్కారు.అదంతా మర్చిపోకముందే మళ్లీ ఈ కొత్త తథంగం కేంద్రం తీసుకురానుందని తెలియడంతో కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా సాధారణ ప్రజలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube