దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.అనంతరం చంద్రబాబుకు ఐటీ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి ఆధారాలు లేనిదే ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయరని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.