తెలుగు లో వచ్చిన సినిమాల్లో మంచి సక్సెస్ సాధించిన యూత్ ఫుల్ సినిమాల్లో చిత్రం, నువ్వునేను, జయం,కొత్త బంగారు లోకం లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈ ఇయర్ లో వచ్చిన బేబీ సినిమా( Baby movie ) కూడా మంచి విజయాన్ని అందుకుంది నిజానికి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అంటే ఈ ఇయర్ లో ఇదే సక్సెస్ ఫుల్ యూత్ ఫుల్ సినిమా గా పేరు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా లో నటించిన ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) కూడా చాలా బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా తో ఇంతకు ముందు యూట్యూబ్ లో సీరీస్ లు చేస్తూ ఉన్న వైష్ణవి హీరోయిన్ గా పరిచయం అయింది మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.

ఇక ఆనంద్ దేవరకొండ కూడా తన కెరియర్ లో ఒక మంచి సక్సెస్ సాధించాడనే చెప్పాలి.ఈ సినిమా తో కామెడీ సినిమాలు( Comedy movies ) మాత్రమే చేస్తాడు అనే పేరు ఉన్న సాయి రాజేష్ ఈ సినిమా తో మంచి సెన్సిబుల్ స్టోరీలను కూడా చాలా బాగా డీల్ చేయగలడు అనే పేరు అయితే తెచ్చుకున్నాడు…దీంతో ప్రస్తుతం ఆయన కి మంచి అవకాశాలు వస్తున్నాయి అనే చెప్పాలి.ఇప్పటికే రాజేష్ కి చాలా మంది ప్రొడ్యూసర్లు మాతో సినిమాలు చేయండి అని ఆయన వెంబడి పడుతున్నారు అని తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే సాయి రాజేష్ స్టోరీ చెప్తాను అని చెప్తాను అని అంటే అసలు స్టోరీ కూడా వినలేదు అని మొన్నటిదాకా విశ్వక్ సేన్( Vishwak Sen ) మీద ట్రోలింగ్ చేశారు ఇక ఇప్పుడు అన్ని సద్దుమనిగిపోయాయి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాయి రాజేష్ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ టాక్ వస్తుంది.ఇక ఇప్పటికే కథ కూడా చెప్పాడట కానీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమా( Khushi movie) రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ ని బట్టి ఇది ఒకే చేద్దామా లేదా అనేది డిసైడ్ అవుతాడని తెలుస్తుంది.

సాయి రాజేష్ ప్రాజెక్ట్ కనక విజయ్ తో సెట్ అయితే ఇక ఆయన డైరెక్టర్ గా మంచి సక్సెస్ సాధించినట్టే అని మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…ఇక సెప్టెంబర్ నెలలో విజయ్ హీరో గా నటించిన ఖుషి సినిమా కూడా రిలీజ్ కి రెడీ గా ఉన్న విషయం మనకు తెలిసిందే…
.