చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది.హల్ చల్ చేసిన గజరాజు భార్యాభర్తలను తొక్కి చంపిందని తెలుస్తోంది.
గుడిపాల మండలం రామాపురం హరిజనవాడలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.ఏనుగు దాడి నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.