రుతువులను అనుసరించి ప్రతి పనిని మొదలుపెట్టే మన పూర్వీకులు విద్యను ప్రారంభించేందుకు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు.అదే శ్రావణ పూర్ణిమ.
( Shravana Poornima ) ఈ రోజున ద్విజులు ద్విజులు అధ్యాయోపకర్మలు చేస్తుండేవారు.అదే ప్రస్తుత కాలంలో ఉపకర్మ గా మారిపోయింది.
ముఖ్యంగా చెప్పాలంటే రాఖీ పూర్ణిమ( Rakhi Poornima ) గురించి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.ఇప్పుడు రాఖీని అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు కట్టుకుంటున్నారు.
కానీ మొదట ఈ రాఖీని ఓ భార్య భర్తకు కట్టిందని, ఓ దేవత రాక్షస రాజుకు కట్టిందని, ఓ రాణి తమ శత్రు రాజుకు పంపిందని చాలామందికి తెలియదు.
వృత్తాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు( Indrudu ) ఓడిపోయే పరిస్థితి వచ్చింది.అప్పుడు అతనికి విజయం కలగాలని కోరుతూ తన భార్య ఇంద్రాణి( Indrani ) ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతని కుడి చేతి మణికట్టుకు కట్టింది.అలా రాఖి పుట్టిందని పురాణాలలో ఉంది.
ఒకసారి రాక్షస రాజైన బలి చక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు.దానవుల నుంచి మనుషులను కాపాడడానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకు వస్తాడు.
అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరకు వెళుతుంది.శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తి( Bali Chakravarthy ) చేతికి పవిత్ర దారాన్ని కట్టి తను ఎవరో చెబుతుంది.
తన భర్తను ఎలాగైనా తిరిగి వైకుంఠం పంపించాలని కోరుతుంది.అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోరడంతో తన రాజ్యాన్ని వదిలి మనుషులకు విముక్తి కలిగిస్తాడు.విష్ణుమూర్తిని వైకుంఠనికి వెళ్ళమని కోరుతాడు.అలాగే ఒక సారి శ్రీకృష్ణుల( Sri Krishna ) వారి చేతికి గాయం అయితే ద్రౌపది( Draupadi ) తన చీరను చించి ఆ చేతి నుంచి రక్తం కాకుండా కట్టు కట్టింది.
ఆమెకు తన మీద గల ఆ సోదరా ప్రేమకు శ్రీకృష్ణుడు కష్టకాలంలో ఆదుకుంటానని, ఆమెకు రక్షగా ఉంటానని మాట ఇచ్చాడు.శ్రీకృష్ణుడు దాన్ని రక్షాబంధనముగా భావించాడని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL