భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు 12 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం తెలిసిందే.ప్రమాదానికి గల ప్రధాన కారణం వాతావరణం అని.
దర్యాప్తు బృందాలు అనుకుంటూ ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ సాయితేజ్ కూడా మరణించడం జరిగింది.
సాయి తేజ్ మరణం పట్ల ఏపీ సీఎం జగన్ తో పాటు వివిధ పార్టీల నాయకులు స్పందించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.కాగా తాజాగా “మా” అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సాయి తేజ్ మరణం పట్ల స్పందించి.ఆ కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
పిల్లల చదువు బాధ్యత మొత్తం తానే తీసుకుంటానని సాయి తేజ్ భార్య శ్యామలకి మాట ఇచ్చారు.ఫోన్లో సంభాషించిన విష్ణు ధైర్యంగా ఉండాలని.తెలిపారు.వారం పది రోజుల్లో నేరుగా వచ్చి మాట్లాడతానని స్పష్టం చేశారు.
పాఠశాల చదువుకు సంబంధించి బాధ్యత మొత్తం తానే తీసుకుంటాను.ధైర్యంగా ఉండాలని మేమంతా ఉన్నాము .వారం పది రోజుల్లో నేరుగా ఇంటికి వచ్చి కలుస్తాను అని సాయితేజ్ భార్య శ్యామలకి మంచు విష్ణు ఫోన్లో తెలిపారు.