మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అత్యంత పాపులారిటీని దక్కించుకున్న గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే.ఆస్కార్ వేటలో మన నాటు నాటు పాట నిలిచిన విషయం తెల్సిందే.
ఆ నేపథ్యం లోనే రామ్ చరణ్ కు గుడ్ మార్నింగ్ అమెరికా లో పాల్గొనే అవకాశం దక్కింది అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది తెలియదు కానీ మొత్తానికి హాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గుడ్ మార్నింగ్ అమెరికా షో లో రామ్ చరణ్ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ సమయంలోనే కొందరు ఎందుకు రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఎందుకు ఎన్టీఆర్ పాల్గొనలేదు అంటూ చర్చించుకుంటున్నారు.
రామ్ చరణ్ కు బాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు… ఎన్టీఆర్ కు ఇంగ్లీష్ రాదని ఆ షో కు రామ్ చరణ్ ను తీసుకు వెళ్లారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

నందమూరి అభిమానులు ఈ సమయంలో ఎన్టీఆర్ మరియు చరణ్ ఇంగ్లీష్ స్పీకింగ్ వీడియోలను షేర్ చేస్తున్నారు.ఎన్టీఆర్ కు ఈ విషయం లో అన్యాయం జరిగింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఎన్టీఆర్ గుడ్ మార్నింగ్ అమెరికా షో లో మాట్లాడేవాడు అని.కానీ రామ్ చరణ్ ను ఎందుకు పంపించారో అర్థం కావడం లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గుడ్ మార్నింగ్ అమెరికా షో లో ఎన్టీఆర్ పాల్గొంటే బాగుండేది అంటూ చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ ఆ షో కి హాజరు కావడం కూడా తెలుగు వారు మాత్రమే కాకుండా మొత్తం ఇండియా గర్వించే విషయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.