పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) హీరోగా ఎంత పెద్ద ఎత్తున ఎదిగాడో మనందరికీ తెలిసిందే…అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయన కి ఇన్ని రోజుల నుంచి ఇన్స్టా లో మాత్రం అకౌంట్ లేదు.అందుకే ఆయన రీసెంట్ గా ఇన్స్తా లో అకౌంట్ కూడా క్రియేట్ చేశాడు దానికి కొన్ని గంటల్లోనే ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే 2.4 మిలియన్ ఫాలోవర్స్ నమోదైన ఖాతాగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక ఈ అకౌంట్‌లో తొలి పోస్ట్‌గా తన సినీ జీవితం గురించి అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులతో ఏర్పడిన అనుబంధం గురించి, అలాగే వారితో దిగిన ఫొటోలు వంటి వాటితో ఓ వీడియోని షేర్ చేశాడు పవన్ కళ్యాణ్…
అలాగే చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను అంటూ కొన్ని లైన్స్ రాసుకొచ్చాడు.ఇవి హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎమోషనల్ అయ్యేలా చేశాయి అని చెప్పాలి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోలో నిధి అగర్వాల్ తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.
నిధి అగర్వాల్( Nidhi Agarwal ) తెలుగులో 4 సినిమాల్లో నటించింది.తమిళంలో కూడా సినిమాలు చేసి మెప్పించింది…
హరి హర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమాలో పవన్ కి జోడీగా నటిస్తోంది.ఈ సినిమాతో ఆమెకి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కుతుంది అని భావిస్తుంది.ఇదిలా ఉండగా.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమెతో దిగిన ఫోటోను కూడా వీడియోలో జత చేయడంతో ఆమె ఎమోషనల్ అయ్యింది.‘ తెలుగు సినీ పరిశ్రమలో భాగమై.
ప్రతిభావంతులు, నిరాడంబరులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం అంటూ ఆమె కూడా చాలా చక్కటి రెస్పాన్స్ ఇచ్చింది…దీంతో ఇప్పుడు ఇది నెట్ లో విపరీతం గా వైరల్ అవుతుంది…
.