తమకు కావలసిన వారి పట్ల చట్టం ఎంత వేగంగా పనిచేస్తుందో ఈటెల రాజేంద్ర విషయంలో మరోసారి నిరూపితమైంది.తన భర్తకు బారాస ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy )వల్ల ప్రాణహాని ఉందని ఈటెల జమున( Etela Jamuna ) నిన్న మీడియా వేదికగా ఆరోపించారు.
అంతేకాకుండా తమను అనే ఆర్దిక విషయాల్లో సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.అయితే ఈటెల భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేసి 24 గంటలు గడవక ముందే ఈటెలకు వై కేటగిరి భద్రతను ఏర్పాటు చేస్తునట్లుగా తెలుస్తుంది .అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటన అయితే రాలేదని రెండు మూడు రోజుల్లో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని తెలుస్తుంది .ఇదంతా ఈటెలను బుజ్జగించే ప్రయత్నాలలో భాగమే అని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.

గత కొంతకాలంగా బిజెపి విధానాల పట్ల అసంతృప్తిగా ఉంటున్న ఈటెల రాజేందర్ ( Etela Rajender )ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా గైర్హాజరవుతున్నారు.భారతీయ రాష్ట్ర సమితి పట్ల కఠినంగా వ్యవహరించడంలో బిజెపి విధానం సరిగ్గా లేదని భావిస్తున్న ఈటెల పార్టీ విధానం ఇలాగే ఉంటే తాము బారాసతో లాలూచి పడ్డామన్న సంకేతాలు తెలంగాణ ప్రజానీకానికి వెళ్తాయని ఇది పార్టీకి అంత మంచిది కాదని అంటున్నారు .ఈ విషయంలో ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమే చర్చించినా కూడా ఆయనకు స్పష్టమైన హామీ రాలేదని, అందుకే ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారని తనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ తో సహా పార్టీ మారతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి

.అయితే ఈటెల ఆరోపణలపై స్పందించలేకపోయినప్పటికీ ఆయన భద్రతపై వేగంగా స్పందించడం ద్వారా ఆయనను కొంత సంతృప్తి పరిచి బుజ్జగించే ప్రయత్నం చేయటం కోసమే ఆయనకు వై క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేశారని తెలంగాణలో కీలక నాయకుల్లో ఒకరైన ఈటెల పార్టీ మారితే అది పార్టీకి వచ్చే ఎన్నికలలో వ్యతిరేకంగా మారుతున్న భావనతోనే ఇంత వేగంగా స్పందించారని తెలుస్తుంది.మరి ఇప్పటికైనా ఈటెల పట్టు వీడతారో లేదో చూడాలి
.