ఏపీలో జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలుస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొత్తు పెట్టి సొంత పార్టీ నేతలకు సైతం అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటూ ప్రగల్భాలు పలికిన పవన్ కల్యాణ్ ను హరిరామ జోగయ్య ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నారేమో అనిపిస్తుందంట.దీంతో జనసేనానికి ఉన్న పరువు, ప్రతిష్ట గంగలో కలిసిపోతుందేమో అనిపిస్తుందని కొందరు ఏపీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
నిన్నటికి నిన్న కాపులకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ వారికి కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు అయినా కేటాయించాలని డిమాండ్ చేస్తూ హరిరామ జోగయ్య లేఖ రాసిన( Harirama Jogaiah ) సంగతి తెలిసిందే.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులు బలంగా ఉన్నారన్న ఆయన వారికి ప్రాధాన్యం ఇవ్వలేనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లారంటూ లేఖలో ప్రశ్నించారు.
ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందన్న విషయం తెలిసిందే.
ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు అయితే పెట్టుకుంది.
కానీ సీట్ల వ్యవహారంపై మాత్రం ఎవరికీ క్లారిటీ రాలేదు.అసలు పవన్ కల్యాణ్ ను ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి.
జనసేనకు చంద్రబాబు సుమారు 25 నుంచి 30 సీట్ల వరకు ఇస్తారని జన సైనికులు భావిస్తున్న సమయంలోనే కాపులకు 60 సీట్లు కావాలంటూ హరిరామ జోగయ్య కోరుతూ పవన్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

అయితే నారా లోకేశ్ (Nara Lokesh )ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం – నవశకం’ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్యనేతలతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.అయితే సభా వేదికపై ప్రసంగించిన లోకేశ్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనంటూ ప్రకటించారు.
దీనిపై పవన్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు.దీనిపై హరిరామ జోగయ్య పవన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించారు.
లోకేశ్ కామెంట్స్ నేపథ్యంలో చంద్రబాబును పూర్తికాలం సీఎంగా చేయడానికి ఆమోదం తెలిపారా? అని ప్రశ్నించారు.అలాగే బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జనసైనికులకు ఏం సమాధానం చెప్తారంటూ ధ్వజమెత్తారని తెలుస్తోంది.
ఏపీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు కులాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయన్న ఆయన 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు.నీతివంతమైన పాలనను అందిస్తారని భావిస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారో తెలియజేయాలంటూ లేఖలో తెలిపారు.