సాధారణంగా మనుషులకు మాత్రమే మరణశిక్ష విధిస్తారు.అయితే ఇక్కడ ఓ దేశంలో మాత్రం విచిత్రంగా రెండు కుక్కలకు మరణశిక్ష విధించడం కలకలం రేపింది.
పాకిస్థాన్‌లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కరాచీలోని ఓ న్యాయవాదిపై ఈ కుక్కలు దాడి చేశాయన్న కారణంగా శిక్షను విధించారు.
రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించడం స్థానికంగా అలజడి రేపింది.మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ గత నెలలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెల్లారు.
ఆ సమయంలోనే అక్కడ ఓ రెండు కుక్కలు ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది.కుక్కల దాడిలో ఆయన తీవ్రంగా గాయాల పాలయ్యాడు.
కుక్కలు దాడి చేసిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సంగతి కాస్తా ప్రపంచానికి తెలిసింది.
కౄరమైన కుక్కలను ఇళ్ల మధ్య ఉంచడంపై అందరూ పెదవి విరుస్తున్నారు.
దీనికి సంబంధించి యజమానిపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అక్తర్ లాయర్ కావడంతో ఆయన కుక్కల గురించి కోర్టుకు వెల్లి న్యాయం అడిగాడు.అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్ రాజీకి వచ్చి సమస్వయం చేసుకున్నాడు.
కానీ రాజీకి అంగీకరిస్తూనే లాయర్ అక్తర్ యాజమానికి కొన్ని షరతులు విధించాడు.

ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పి తీరాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దంటూ షరతులు పెట్టాడు.అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని కుక్కల యజమానికి లాయర్ అక్తర్ షరతులు పెట్టాడు.ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో అందజేశారు.
దీంతో కుక్కలకు మరణశిక్ష విధించారు.ప్రస్తుతం కుక్కల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.