ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే.అది శివాలయమని.
మొఘలుల కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మసీదును నిర్మించారంటూ హిందూ సంఘాలు , పలువురు వ్యక్తులు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇదిలా వుండగానే ఢిల్లీలోని కుతుబ్‌మినార్, ఆగ్రాలోని తాజ్‌మహాల్ సహా దేశంలోని కొన్ని మసీదులు వున్న ప్రదేశాల్లో గతంలో హిందూ ఆలయాలు వుండేవని.
వాటిని కూల్చివేసి మసీదులు, దర్గాలు నిర్మించారంటూ కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ వ్యవహారం దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ క్రమంలో భారత్‌లోని పరిణామాలపై అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిలో భాగంగా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించిన ఆ సంస్థ నిర్వాహకులు స్థానిక గాంధీ మెమోరియల్ ప్లాజాలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
జ్ఞానవాపి మసీదుతో పాటు భారత్‌లోని వేలాది మసీదులను నేలమట్టం చేసే కుట్ర జరుగుతోందని ఐఏఎంసీ ఆరోపిస్తోంది.200 మంది మిలియన్ల మంది జనాభాతో భారత్‌లో ముస్లింలు అతిపెద్ద మైనారిటీ వర్గంగా వున్నారని ఈ సంస్థ గుర్తుచేసింది.వారి ఇళ్లు, వ్యాపారాలు, ప్రార్థనా స్థలాలను స్థానిక అధికారులు కూల్చివేస్తున్నారని.అలాగే కొన్ని వర్గాల నుంచి ముస్లింలు హింసాత్మక చర్యలను ఎదుర్కొంటున్నారని ఐఏఎంసీ వాదిస్తోంది.భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు ముగింపు పలకాలని సంస్థ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది.దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరింది.
ఒక్క ముస్లింలే కాకుండా.క్రైస్తవులు కూడా భారత్‌లో బాధితులుగా వున్నారని ఐఏఎంసీ ఆరోపిస్తోంది.