కెనడా: మానిటోబా ప్రావిన్షియల్ నామినేషన్ కింద 221 మంది విదేయులకు ఆహ్వానం

ప్రావిన్షియల్ నామినేషన్ కింద కెనడా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 221 మంది అభ్యర్ధులకు మానిబోటా ప్రావిన్స్ ఆహ్వానం పలికింది.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రాం (ఎంపిఎన్‌పీ) డిసెంబర్ 6న డ్రాను నిర్వహించింది.

 Manitoba Invites Foreign Workers And Graduates-TeluguStop.com

దీనిలో భాగంగా మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్, స్కిల్డ్ వర్కర్ ఓవర్సీస్ కేటగిరీ, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్‌ అభ్యర్థులను ఆహ్వానించింది.

లెటర్స్ ఆఫ్ అడ్వైస్ టు అప్లై (ఎల్ఏఏ) అని పిలవబడే ఆహ్వానాలను ఈ కింది విధంగా పంపిణీ చేశారు.

* మానిటోబాలో స్కిల్డ్ వర్కర్స్ -165
* ఓవర్సీస్ స్కిల్డ్ వర్కర్స్ – 23
* ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ – 33

Telugu Canada, Manitoba, Telugu Nri Ups-

కాగా ఈ ఏడాది ఎంపీఎన్‌పీ కింద జారీ చేసిన ఎల్ఐఏల సంఖ్య 7,362కు చేరుకుంది.డిసెంబర్ 6 నిర్వహించిన డ్రాలో ఆహ్వానించబడిన 221 మంది అభ్యర్థులలో 18 మందికి ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో ఇప్పటికే ప్రొఫైల్ ఉంది.వయస్సు, పని అనుభవం, విద్య, భాషా సామర్ధ్యం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని సమగ్ర ర్యాంకింగ్ సిస్టమ్(సీఆర్ఎస్) ఆధారంగా స్కోరు ఇవ్వబడుతుంది.

Telugu Canada, Manitoba, Telugu Nri Ups-

ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ నుంచి రెగ్యులర్ డ్రా ద్వారా కెనడియన్ శాశ్వత నివాసం కోసం అత్యధిక స్కోరు సాధించిన అభ్యర్థులు ఆహ్వానించబడ్డారు.ప్రావిన్షియల్ నామినేషన్ పొందిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్ధులకు అదనంగా 600 సీఆర్ఎస్ పాయింట్లు ఇవ్వబడతాయి.ఇది కెనడియన్ శాశ్వత నివాసం కోసం ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో దరఖాస్తు చేసుకోవడానికి స్పష్టమైన హామీ ఇస్తుంది.

మానిటోబా నుంచి ప్రావిన్షియల్ నామినేషన్ లభించాలంటే.ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్థులకు మానిటోబాలోని డిమాండ్‌ ఉన్న వృత్తులలో ఒక దానిలో పని అనుభవంతో పాటు ఇతర అర్హతలు ఉండాలి.

దీనితో పాటు ఎంపీఎన్‌పీకి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.అలాగే మానిటోబా స్కిల్డ్ వర్కర్ కేటగిరీ ద్వారా ఆహ్వానించబడిన అభ్యర్ధులు మానిటోబాలో పనిచేస్తూ ఉండటంతో పాటు ఫుల్ టైమ్, పర్మినెంట్ ఉద్యోగ ఆఫర్ కలిగి ఉండాలి.

ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న గ్రాడ్యుయేట్లను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ కింద మానిటోబా ఆహ్వానిస్తుంది.ఈ స్ట్రీమ్‌లో మూడు సబ్ కేటగిరీలు ఉన్నాయి.కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ పాత్‌వే, గ్రాడ్యుయేట్ ఇంటర్న్‌షిప్ పాత్‌వే, స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ పాత్‌వే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube