వేసవి కాలం( summer season ) పిల్లలకు అత్యంత ఇష్టమైన సీజన్.వేసవిలో స్కూల్స్ కు సెలవులు కావడంతో పిల్లలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
తమ స్నేహితులతో ఆటలు ఆడుకుంటూ హుషారుగా సమయం గడుపుతుంటారు.ఆటల్లో పడి సమయానికి తినడం, తాగడం అన్ని మర్చిపోతుంటారు.
ఫలితంగా ఎండ దెబ్బకు గురై జబ్బుల బారిన పడతారు.అందుకే వేసవిలో పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ లో అధిక శాతం పిల్లల్లో తలెత్తే సమస్య డీహైడ్రేషన్( Dehydration ) .ఆటల్లో పడి పిల్లలు దాహం వేసినా కూడా వాటర్ ను నిర్లక్ష్యం చేసుకుంటారు.అందుకే తల్లిదండ్రులు ప్రతి గంటకు పిల్లలు వాటర్ తాగమని గుర్తు చేస్తూ ఉండాలి.
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వారికి వాటర్ బాటిల్ ను ఇవ్వాలి.అలాగే వేసవిలో పిల్లల చేత నిత్యం కొబ్బరి నీళ్లు తాగించాలి.
ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్‌లు, రాగి జావ, లెమన్ వాటర్, మజ్జిగ, క్యారెట్ జ్యూస్( Fruit juices, ragi java, lemon water, buttermilk, carrot juice ), పచ్చకాయ మొదలైన వంటివి పిల్లలకు ఇవ్వాలి.ఇవన్నీ డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యల నుంచి పిల్లలను రక్షిస్తాయి.
మరియు శరీరానికి బోలెడంత శక్తిని చేకూరుస్తాయి.

అలాగే వేసవిలో పిల్లలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్( Ice creams, junk food ) వంటివి తీసుకోవడానికి మక్కువ చూపుతుంటారు.కానీ ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.ఇటువంటి ఆహారాలు ఎసిడిటీ, మలబద్ధకం, కడుపునొప్పి, గొంతునొప్పి, జలుబు తదితర సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా చూసుకోండి.వేసవిలో పిల్లలు ఫ్రిడ్జ్ వాటర్ తెగ తాగేస్తూ ఉంటాయి.అయితే ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు లేత రంగు దుస్తులు వేయండి.అలాగే తప్పకుండా సన్ స్క్రీన్ అప్లై చేయండి.సన్ స్క్రీన్ వద్ద చర్మ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
మరియు లేత రంగు దుస్తులు ఎండవేడిని తక్కువగా గ్రహిస్తాయి.ఇక వేసవిలో ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలను బయటకు పంపకూడదు.
ఉదయం 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల తర్వాతే ఆడుకోవడానికి పంపించాలి.