దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి( Abhishek Boinpally ) బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు.ఈ పిటిషన్ పై విచారణ మే నెలలో ఉన్నట్లు చూపుతోందని లాయర్ కపిల్ సిబల్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను ఈ నెల 24వ తేదీ లోపే విచారణకు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు.ఈ కేసులో ఈడీ( ED ) తరపున ఏఎస్జీ ఎస్వీ రాజు ఉన్నారు కదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ అభిషేక్ బోయినపల్లికి బెయిల్( Bail Petition ) ఇచ్చేందుకు ఎస్వీ రాజు ఇప్పటికే అంగీకరించారని ధర్మాసనానికి తెలిపారు.దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఎస్వీ రాజు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని జస్టిస్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు.
తరువాత కేసు విచారణను మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.