చిత్రం సినిమాతో ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ( Director Teja ) ఆ తర్వాత చేసిన నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో వరుసగా మూడు హిట్లు అందుకున్నాడు.ఇక ఈ సినిమాల తర్వాత మహేష్ బాబు తో నిజం అనే సినిమా కూడా చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అయింది.
ఇక దాంతో ఆయన చేసిన చాలా సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి ఇక అప్పుడు రానా తో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా( Nene Raju Nene Mantri ) మంచి విజయం సాధించింది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన కాజల్ హీరోయిన్ గా బెల్లం కొండ శ్రీనివాస్ హీరో గా తీసిన సీత సినిమా( Sita Movie ) కూడా ప్లాప్ అయింది ఇక దాంతో ప్రస్తుతం ఆయన ఒక పెద్ద సినిమా చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది…అందులో భాగంగానే హీరో రానా తో( Rana Daggubati ) కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా కి శ్రీకారం చుట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక రీసెంట్ గా రానా వాళ్ల తమ్ముడు అయిన అభిరామ్ ని హీరో గా పరిచయం చేస్తూ ఆయన చేసిన అహింస సినిమా ప్లాప్ అయింది.
ఇక దాంతో ఇప్పుడు మళ్ళీ రానా తో ఒక భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టి మళ్ళీ తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈయన తీసే ఈ సినిమాలో ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఆర్టిస్ట్ లు నటించబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది…ఇంకా ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ గా తెలీదు ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు తెలుస్తాయి… నిజానికి ఈ సినిమా అనేది తేజ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి తీస్తున్న సినిమా గా చాలా మంది చెబుతున్నారు…
.