కేజిఎఫ్ సినిమా( KGF Movie ) ద్వారా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో కన్నడ నటుడు యశ్ ( Yash ) ఒకరు.అప్పటివరకు పలు బుల్లితెర సీరియల్స్ అలాగే చిన్న చిన్న సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయనకు కే జి ఎఫ్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందించిందని చెప్పాలి.
ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో యష్ ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాని ఇప్పటివరకు ప్రకటించలేదు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారినటువంటి శ్రీలీల( Sreeleela ).గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో శ్రీ లీల కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే శ్రీ లీల గురించి అదే విధంగా నటుడు యశ్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.శ్రీ లీల నటుడు యశ్ ను బావ అంటూ పిలుస్తారనే వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఇలా తనని బావ అని పిలవడంతో వీరిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదని అయినప్పటికీ యశ్ ను శ్రీ లీల బావ అని పిలుస్తుందని తెలుస్తోంది.అలా పిలవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే…

నటి శ్రీ లీల తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ అనే విషయం మనకు తెలిసిందే.ఈమె బెంగళూరులో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక భార్య రాధిక ( Radhika )ఇద్దరు పిల్లలకు శ్రీ లీల తల్లి పురుడు పోసారట ఇలా రాధిక తరచూ హాస్పిటల్ కి రావడంతో శ్రీ లీల తనని ఎంతో ఆప్యాయంగా అక్క అని పిలవడం అలాగే హీరో యశ్ ను బావా అని పిలుస్తూ ఉండేవారట.ఇలా వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారడమే కాకుండా ఏదైనా ప్రైవేట్ పార్టీలలో కనుక కలిస్తే శ్రీ లీల మాత్రం హీరో యశ్ ను బావ అంటూ పిలుస్తారని తెలుస్తోంది.