భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు మరోసారి స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఒలంపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రా( Neeraj Chopra ).
హంగేరీ లోని బుడాపేస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఫైనల్ లో అద్భుత ఆటను ప్రదర్శించి భారతదేశానికి బంగారు పతకం సాధించి పెట్టి సరికొత్త చరిత్రని సృష్టించాడు.ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ( World Athletics Championship )లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
నీరజ్ చోప్రా కెరియర్ చూసుకుంటే ఒలంపిక్స్ గోల్డ్ మెడల్, డైమండ్ లీగ్ ట్రోఫీ, వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ తో సహా అన్ని గ్లోబల్ మెడల్స్ ను పూర్తి చేశాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్వాలిఫయర్ లో జావెలిన్ ను 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా నేరుగా ఫైనల్ లో అడుగు పెట్టాడు.నీరజ్ చోప్రా ఫామ్, పట్టుదల చూసి భారత అభిమానులు కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని ఆశించారు.నీరజ్ చోప్రా ఫైనల్స్ లో తొలి ప్రయత్నంలో విఫలమైన రెండో ప్రయత్నంలో జావెలిన్ ను 88.17 మీటర్ల దూరం విసిరాడు.ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98 మీటర్ల దూరానికి జావెలిన్ ను విసిరాడు.

నీరజ్ చోప్రా ప్రత్యర్థులు కిషోర్ జెనా ( Kishore Jena )84.77 మీటర్లతో ఐదవ స్థానానికి పరిమితం అయ్యాడు.డీపీ మను 84.14 మీటర్లతో ఆరవ స్థానంలో నిలిచాడు.ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్ ను 87.82 మీటర్ల దూరం విసిరాడు.ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల దూరం విసిరాడు.గత ఏడాది యూజీన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా రజక పతకం సాధించాడు.
తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారతదేశానికి మూడవ పతకం కావడం విశేషం.