వైరల్ వీడియో: తల్లిదండ్రులకు అలర్ట్.. జెల్లీలు తింటే పిల్లలకు చాలా డేంజర్..

చిన్నపిల్లలు ఇష్టంగా జెల్లీ ఫ్రూట్స్( Jelly Fruits ) తింటుంటారు.పేరెంట్స్ కూడా ఆ పిల్లలు ఇవి తింటున్న కూడా వారిని ఆపరు.

 Viral Video: Alert For Parents.. Eating Jellies Is Very Dangerous For Children..-TeluguStop.com

అయితే ఇవి ఎలా తయారవుతాయో చూస్తే అవి ఎంత డేంజరో అర్థం అవుతుంది.తాజాగా తల్లిదండ్రులందరికీ కనువిప్పుగా మారే ఒక జెల్లీ మేకింగ్ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

జెల్లీలను ఎలా తయారు చేస్తారో తెలిపే ఆ వీడియోను @reelsyemegim అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ రీసెంట్‌గా షేర్ చేసింది.ఆ వీడియోలో కృత్రిమంగా రంగులు కలిపిన ఆరెంజ్ ఫ్లేవర్ లిక్విడ్‌తో ప్లాస్టిక్ కేసింగ్స్‌ను నింపే ఒక మెషిన్ కనిపించింది.

తర్వాత ఆ ప్లాస్టిక్ క్యాన్‌లను మూతతో క్లోజ్ చేస్తారు.అనంతరం ఆ ప్లాస్టిక్ డబ్బాలు ప్రాసెస్ చేయబడతాయి.

వాటిలోని ద్రవం మందపాటి జెల్లీగా మారుతుంది.

ఈ వీడియో జెల్లీల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.ప్లాస్టిక్ కేసింగ్స్‌ ఆరోగ్యానికి హానికరం అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు, ముఖ్యంగా అవి తీసుకుంటే చిన్నపిల్లలకు అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు.మైక్రో ప్లాస్టిక్( Micro plastic ) పిల్లల కడుపులోకి వెళ్తుందని, ఈ ప్రాసెసింగ్ చాలా చెడ్డదని ఫైర్ అవుతున్నారు.

మరికొందరు జెల్లీల్లో కృత్రిమ రంగులు, రుచుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.చాలా మంది ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, జెల్లీలు తినటం చాలా ప్రమాదకరమని ఆందోళనలను వ్యక్తం చేశారు.

ఈ వీడియోపై జెల్లీ తయారీదారులు స్పందిస్తూ, తమ ఉత్పత్తులు తినడానికి సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.ప్లాస్టిక్ క్యాన్లను ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారు చేశామని, కృత్రిమ రంగులు, రుచులను ప్రభుత్వం ఆమోదించిందని వారు అంటున్నారు.అయినప్పటికీ, కొంతమందికి ఇప్పటికీ నమ్మకం లేదు.

సురక్షితంగా ఉండేందుకు తాము పూర్తిగా జెల్లీలకు దూరంగా ఉంటామని అంటున్నారు.జెల్లీలు తినడానికి సురక్షితంగా ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టమైన ఏకాభిప్రాయం లేదు.

అంతిమంగా, జెల్లీలు పిల్లలు తినకపోవడమే శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube