మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.అందుకే ఈయన మెగాస్టార్ గా మెగా ఫ్యాన్స్ తో పిలిపించుకుంటూ స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ సేఫ్ గేమ్ ఆడడానికే ఎక్కువుగా ఇష్ట పడుతున్నాడు.దీంతో ఈయనకు కెరియర్ లో ఎప్పుడు లేని బిగ్గెస్ట్ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.
వరుసగా రీమేక్ సినిమాలనే( Remake Movies ) ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను తానే తగ్గించు కుంటున్నాడు అని ఫ్యాన్స్ ఎప్పటి నుండి అనుకుంటున్నారు.మెగాస్టార్ నుండి స్ట్రైట్ సినిమానే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కానీ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఈయన స్ట్రైట్ సినిమాలు చేసింది చాలా తక్కువ అనే చెప్పాలి.ఇక ఇటీవలే భోళా శంకర్ వంటి మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.ఊహించని ఫలితంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది.ఏకంగా 50 కోట్లకు పైగానే నష్టాలు వాటిల్లుతాయని అంచనా.ఇక ఈ క్రమంలోనే భోళా శంకర్( Bhola Shankar ) తర్వాత చిరంజీవి నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈయన నుండి ఇక రీమేక్ సినిమాలు రావని స్ట్రైట్ సినిమాలు మాత్రమే వస్తాయని అంటుండగా ఈయన క్రేజీ లైనప్ లోకి ఇప్పుడు కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.మెగాస్టార్ తో పవర్ఫుల్ సినిమా స్టాలిన్ ను తెరకెక్కించిన మురుగుదాస్( AR Murugadoss ) అందరికి తెలుసు.ఈయన తమిళ్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో కూడా సినిమా చేసాడు.
మరి ఇప్పుడు మెగాస్టార్ తో మరోసారి సినిమాను తెరకెక్కించ బోతున్నాడు అనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఇందులో ఎంత నిజమో తెలియాల్సి ఉంది.