మొక్కల ఆధారిత మాంసాన్ని జ్యూసీగా, కొవ్వు లేకుండా తయారు చేసిన ఎన్నారై సైంటిస్ట్...

మొక్కల ఆధారిత మాంసం( Plant Based Meat ) తరచుగా పొడిగా, బాగా పీక్కుపోయి కనిపిస్తుంది.అందుకే ప్రజలు దీన్ని ఇష్టపడరు.

 Indian-origin Scientist Makes Plant-based Meat More Juicy With No Fat,nri Scient-TeluguStop.com

అయితే వాటిని అందరూ ఇష్టపడేలా తయారు చేసే ఒక మార్గాన్ని యూకేలోని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త కనుగొన్నారు.నీటిని ఉపయోగించడం ద్వారా మొక్కల ఆధారిత మాంసాన్ని జ్యూసీగా, కొవ్వు రహితంగా మార్చే మార్గాన్ని ఆయన కనిపెట్టారు.

Telugu Fat, Indian, Microgels, Nri Scientist, Meat-Telugu NRI

శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అయిన అన్వేష సర్కార్( Professor Anwesha Sarkar ) మొక్కల ప్రోటీన్ మైక్రోజెల్స్‌ను సృష్టించారు.ఇవి మొక్కల ప్రోటీన్లు, నీటితో తయారైన చిన్న కణాలు.మైక్రోజెల్స్( Microgels ) ఒత్తిడికి గురైనప్పుడు, అవి నీటిని స్రవిస్తాయి, ఇది మొక్కల ఆధారిత మాంసాన్ని జ్యూసీగా చేస్తుంది.మొక్కల ప్రోటీన్లను నీటిలో వేడి చేయడం ద్వారా మైక్రోజెల్స్ క్రియేట్ అవుతాయి.

ఇది ప్రోటీన్ అణువుల నిర్మాణాన్ని మారుస్తుంది, ఇవి నీటిని ట్రాప్ చేసే నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి.నెట్‌వర్క్ అప్పుడు మైక్రోజెల్స్‌గా డివైడ్ అవుతుంది.

మొక్కల ఆధారిత మాంసాన్ని జ్యూసీగా చేయడానికి మైక్రోజెల్‌లు ఆరోగ్యకరమైన, స్థిరమైన మార్గం.అవి ఇతర ఆహారాలలో కొవ్వును భర్తీ చేయడానికి ఉపయోగించవచ్చు.

మైక్రోజెల్స్ అనేది మొక్కల ఆధారిత మాంసాన్ని మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేసే కొత్త సాంకేతికత.అవి కొవ్వు( Fat )కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.

Telugu Fat, Indian, Microgels, Nri Scientist, Meat-Telugu NRI

ప్లాంట్ ప్రోటీన్ మైక్రోజెల్స్‌ అనేవి పీ ప్రోటీన్, సోయా ప్రోటీన్ గోధుమ గ్లూటెన్ వంటి మొక్కల ప్రోటీన్‌ల నుంచి తయారవుతాయి.మైక్రోజెల్‌లు చిన్న కణాలు, ఇవి దాదాపు 100 నానోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.మైక్రోజెల్స్ నీటి ఆధారితమైనవి, కాబట్టి అవి ఫ్యాట్-ఫ్రీ( Fat Free ) , హెల్తీగా ఉంటాయి.ఇవి మొక్కల ఆధారిత మాంసాన్ని మరింత జ్యూసీగా, రుచిగా మారుస్తాయి.

అలానే జంతువుల ఉత్పత్తులను తీసుకోవడాన్ని తగ్గించడంలో ప్రజలకు సహాయపడగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube