నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఎన్నిక వివాదంపై ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ నాగం జనార్థన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

 Nagar Kurnool Mla Marri Janarthan Reddy's Plea In The High Court-TeluguStop.com

అయితే 2018 వ సంవత్సరంలో నాగంపై మర్రి జనార్థన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మర్రి జనార్థన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్థన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇందులో భాగంగా అఫిడవిట్ లో వివరాలు దాచి పెట్టారని ఆరోపించిన ఆయన మర్రి జనార్ధన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తగిన ఆధారాలు లేకపోవడంతో పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube